భారతదేశం, డిసెంబర్ 29 -- అల్లు వారి ఇంట పెళ్లి బాజా మోగబోతుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన వివాహ తేదీని ఇవాళ (డిసెంబర్ 29) ఇన్ స్టాగ్రామ్ లో వీడియో ద్వారా వెల్లడించాడు శిరీష్. తన ప్రియురాలు నయనికతో ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు శిరీష్. అయితే తన పెళ్లి రోజు, అన్న అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఒకటే కావడం ఇక్కడ విశేషం.

అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు నయనికను పెళ్లి చేసుకోబోతున్నాడు. 2025 అక్టోబర్ లో నయనిక, అల్లు శిరీష్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం తన పెళ్లి తేదీని వెల్లడించాడు శిరీష్. మార్చి 6, 2026న నయనిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఓ వీడియోతో ఈ అనౌన్స్ మెంట్ చేశాడు శిరీష్.

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ...