భారతదేశం, మే 25 -- అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు వారి మీదనే గురిపెడుతున్నాయని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్‌పై చెల్లి షర్మిల బాణం ఎక్కుపెడితే.. తెలంగాణలో కేటీఆర్‌పై కవిత గురిపెట్టిందని అన్నారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడాని ప్రజల అవసరాల కంటే.. కుటుంబ అవసరాలే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

'మొన్న వైఎస్సార్ కుటుంబం.. ఇపుడు కేసీఆర్ కుటుంబం.. అన్నలపైకి చెల్లెల్లను ఉసి గొల్పడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలైంది. రేవంత్ బీద అరుపులు అరుస్తున్నారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను.. మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ పుట్టి మునిగిపోయింది. దేశంలో బీజేపీ వెలిగిపోతోంది' అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

'తెలంగాణలో బీజేపీ బలపడింది. భవిష్యత్‌లో అధికారంలోకి కూడా...