భారతదేశం, ఏప్రిల్ 26 -- అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి నలుగురు మృత్యువాత పడ్డారు. ములకలచెరువు మండలంలోని పెద్దచెరువులో ఈ ప్రమాదం జరిగింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....ఈశ్వరమ్మ అనే మహిళ బట్టలు ఉతికేందుకు పిల్లలతో కలిసి పెద్ద చెరువు వద్దకు వెళ్లింది. ఈశ్వరమ్మ కుమార్తె లావణ్య, కుమారుడు నందకిశోర్‌, మరో చిన్నారి నందిత ఆడుకుంటూ చెరువులోకి వెళ్లి గల్లంతయ్యారు.

పిల్లల్ని కాపాడేందుకు వెళ్లిన ఈశ్వరమ్మ భర్త మల్లేశ్‌ కూడా చెరువులో గల్లంతే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు నలుగురి మృతదేహాలను చెరువు నుంచి బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదం పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే రెండు వారాల క్రితం అన్నమయ్య జిల్లాలో నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకోవడానికి బయటకు...