Annamayya district, జూలై 13 -- అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద ఓ లారీ బోల్తా పడిన ఘటనలో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాథమిక వివరాల ప్రకారం.. రైల్వేకోడూరు పరిధికి చెందిన కూలీలు, మామిడికాయలు కోసేందుకు రెడ్డిపల్లె ప్రాంతానికి వచ్చారు. పనులు పూర్తయ్యాక కోసిన కాయలను లారీలో లోడ్ చేసి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలోనే రెడ్డిపల్లె చెరువు కట్ట వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీ కింద ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....