భారతదేశం, మే 5 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.20 వేలు రైతులకు అందించనున్నారు. అయితే కౌలు రైతులు, అటవీ భూహక్కుదాలకూ అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ నెల 20లోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటవీ భూములపై హక్కు కలిగిన(ఆర్ఎస్ఆర్) వారిని అర్హులుగా గుర్తించనున్నారు.

వ్యవసాయ, ఉ...