భారతదేశం, ఏప్రిల్ 30 -- సింహాచలంలో ఘోర ప్రమాదం జరిగి ఏడుగురు భక్తులు చనిపోవడం పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి వెళ్దామనుకుంటే, భక్తులు ఇబ్బంది పడతారని, దర్శనాలకు అంతరాయం ఏర్పడుతుందనే వెళ్లలేదన్నారు. అమరావతి నుంచే ప్రమాదంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం నుంచి ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని, ఈ ఘటనపై అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్‌ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మే 2న జరిగే అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతిలో మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్...