భారతదేశం, ఏప్రిల్ 20 -- ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్న రైతులకు 50 వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.450 కోట్లు ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వంలో పెండింగ్‌ దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా కొత్త కనెక్షన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త కనెక్షన్లకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర విద్యుత్ సామాగ్రి డిస్కంలు సమకూర్చుకుంటున్నాయి.

రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ప్రభుత్వ సమయంలో రైతులు కొత్త వి...