భారతదేశం, ఆగస్టు 11 -- కాంగ్రెస్ సీనియర్ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది! తిరువనంతపురం నుంచి ఆదివారం దిల్లీకి వెళుతునన ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాపాయ ఘటన జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలపై ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. సాంకేతిక సమస్యల కారణంగానే విమానాన్ని చెన్నైకి మళ్లించామని వివరణ ఇచ్చింది.

విమాన ఘటనను కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియా వేదికగా వివరించారు. "తిరువనంతపురం నుంచి దిల్లీకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం ఏఐ 2455లో నేను, ఇంకా అనేక మంది ఎంపీలు, ఇతర ప్రయాణికులు ఉన్నాము. ఈరోజు మాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది! విమానం ఆలస్యంగా బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విపరీతమైన కుదుపులకు లోనయ్యాం. సుమారు గంట తర్వాత, పైలట్ ఫ్లైట్ సిగ్నల్ లోపం ఉందని చెప్పి, వి...