Hyderabad, సెప్టెంబర్ 1 -- క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా సినిమా ఘాటి. తమిళ నటుడు విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు.

ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఘాటి సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఘాటి గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఘాటి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జగపతి బాబు, విక్రమ్ ప్రభు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

యాక్టర్ జగపతి బాబు మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. అనుష్క స్వీటీ అని మనందరికీ తెలుసు. కానీ, ఈ సినిమాల్లో చాలా ఘాటుగా ఉండబోతుంది. అన్ని రియల్ లొకేషన్స్‌లో చేసిన స...