భారతదేశం, అక్టోబర్ 28 -- బాహుబలి సినిమాలు ఎంతటి సంచలనం నమోదు చేశాయో తెలిసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తం చేశాయి ఈ చిత్రాలు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా బాహుబలి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా దగ్గుబాటి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు.

బాహుబలి ది ఎపిక్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.3 కోట్లకు పైగా అడ్వాన్స్ టికెట్ల సేల్స్ జరిగిందంటే ఈ మూవీపై ఉన్న ఇంట్రెస్ట్ అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 1, బాహుబలి 2 కలిసి బాహుబలి ఎపిక్ గా రాబోతుంది.

థియేటర్లలో బాహుబలి...