భారతదేశం, మే 13 -- సివ‌రాప‌ల్లి వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు రామ్‌మ‌యూర్. పంచాయ‌త్ వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో సెక్ర‌ట‌రీ పాత్ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో న‌వ్వించాడు. స‌మంత ప్రొడ్యూస‌ర్‌గా ఇటీవ‌ల రిలీజైన శుభంలో రామ్‌మ‌యూర్ ఓ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. థియేట‌ర్ల‌లో త‌న క్యారెక్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంద‌ని రాగ్ మ‌యూర్ అన్నాడు.

''సినిమా బండి మూవీలో నేను చేసిన మ‌రిడేష్ బాబు క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించింది. మ‌రిడేష్ బాబు క్యారెక్ట‌ర్‌కు కొన‌సాగింపుగా శుభం సినిమాలో నా రోల్ ఉంటుంది. నా పాత్ర‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ చాలా స‌ర‌దాగా డిజైన్ చేశారు. ఆయ‌న క‌థ నెరేట్ చేసిన త‌ర్వాత నా రోల్‌లోని కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంద‌ని అర్థమైంది. అందుక‌నే శుభం సినిమా చేశా. నా న‌మ్మ‌కం నిజ‌మైంద...