భారతదేశం, నవంబర్ 9 -- ఇంటర్నెట్ ను విచ్చలవిడిగా వాడుతూ, ఎలాంటి భయం లేకుండా ఎంతకైనా తెగించడం ఇప్పుడు కామన్ గా మారిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ ఆన్ లైన్ లో వేధిస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కుడా ఈ తరహా వేధింపులు తప్పలేదు. అయితే ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి, దుష్ప్రచారం చేసింది ఎవరో తెలిసి అనుపమ షాక్ అయింది.

నటి అనుపమ పరమేశ్వరన్ తాను ఇటీవల 20 ఏళ్ల యువతి చేతిలో ఎదుర్కొన్న సైబర్ బుల్లీయింగ్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నానని నటి పేర్కొంది. అయితే వేధించిన వారి గుర్తింపును వెల్లడించకూడదని నిర్ణయించుకుంది. సైబర్ వేధింపులపై అనుపమ పరమేశ్వరన్ ఫిర్యాదు చేసింది. ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను ఇటీవల ఎదుర్కొన్న ఆన్‌లైన్ వే...