భారతదేశం, నవంబర్ 19 -- మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ మామూలు బిజీగా లేదు. వరుసగా ఒక దాని తర్వాత ఒకటి ఆమె నటించిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. 2025లో ఆమె హీరోయిన్ గా చేసిన ఏడో సినిమా కూడా రిలీజ్ కు రెడీ అయింది. ఆమె లేటెస్ట్ మూవీ 'లాక్‌డౌన్‌' రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ (నవంబర్ 19) అనౌన్స్ చేశారు.

అనుపమ పరమేశ్వరన్ అప్ కమింగ్ మూవీ లాక్‌డౌన్‌. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సాధ్యపడలేదు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ డిసెంబర్ 5, 2025న రిలీజ్ కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను బుధవారం రిలీజ్ చేశారు.

అనుపమ హీరోయిన్ గా నటించిన లాక్‌డౌన్‌ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. అదే రోజు బాలయ్య బాబు మూవీ అఖండ 2 కూడా థియేటర్లకు రానుంది. ఎన్నో అంచనాలున్న...