భారతదేశం, మే 17 -- దేశంలోనే తొలిసారి అనాథ పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడతాయని మంత్రులు వివరించారు. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క.

'దేశంలోనే మొదటిసారి అనాథ పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులను హైదరాబాద్‌లో అందించాం. పిల్లలకు ఆరోగ్య శ్రీ కార్డులకు అందివ్వడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఇప్పటికే ఆధార్ కార్డు ఇచ్చాం. క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చాం. ఆరోగ్య శ్రీ కార్డులను ఇచ్చి ఎక్కడైనా చికిత్స పొందేలా చేశాం. హైదరాబాద్‌లో 2200 మంది ఉన్నారు. మీ సమ...