భారతదేశం, డిసెంబర్ 24 -- హీరోయిన్ల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నటుడు శివాజీ.. తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు. తన స్పీచ్ లో వాడిన రెండు అసభ్యకరమైన పదాలకు మాత్రమే క్షమాపణలు చెప్పిన శివాజీ.. తాను చెప్పిన అసలు పాయింట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు. ఇటీవల నిధి అగర్వాల్‌ను జనం చుట్టుముట్టిన ఘటనే తనను ఇలా మాట్లాడేలా చేసిందని సమర్థించుకున్నాడు. అనసూయ ఎందుకు మధ్యలో వచ్చిందని ప్రశ్నించాడు.

నటుడు శివాజీ హీరోయిన్ల బట్టల గురించి చేసిన కామెంట్స్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. దీనిపై మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం, నెటిజన్లు పాత వీడియోలు బయటపెట్టడంతో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడు.

శివాజీ మాట్లాడుతూ.. తాను ఇన్నేళ్ళలో ఎప్పుడూ మహిళల గురించి హద్దు దాటి మాట్...