Andhrapradesh, జూలై 3 -- గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని చెప్పారు. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.

"ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి..వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్ట్. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. ఇకపై కూడా అభ్యంతరం చెప్పను" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

సముద్రంలో పోయే నీళ్లను వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టులపై తానెప్పుడు వ్యతిరేకించలేదన్నారు. ...