Andhrapradesh, సెప్టెంబర్ 5 -- రాష్ట్రంలోని అనధికార లేఅవుట్లలో కొన్న స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద.. ఈ ఏడాది జూన్‌ 30 కి ముందు వేసిన లేఔట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు.

ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ద్వారా.. ఆ స్థలానికి న్యాయబద్ధమైన గుర్తింపు దక్కుతుందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆస్తి భద్రత కల్పించుకోవచ్చని సూచిస్తున్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని. ఇందుకు అక్టోబర్ 23వ తేదీ తుది గడువుగా ఉందని పేర్కొంటున్నారు. ఫ్లాట్ల యజమానులకు కూడా అవగాహన కూడా కల్పిస్తున్నారు.

2025 జూన్ 30 వరకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు రెగ్యులరైజేషన్ (LRS) కు అవకాశం ఉంటుంది. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కోసం 90 రోజులు గడువు ...