భారతదేశం, జనవరి 14 -- సంక్రాంతి 2026కు మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వచ్చేసింది. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన అనగనగా ఒక రాజు సినిమా ఇవాళ (జనవరి 14) రిలీజైంది. సంక్రాంతి సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియర్ షోలు ముగిశాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. అనగనగా ఒక రాజు ట్విటర్ రివ్యూను ఒక సారి చూసేయండి.

తనదైన కామెడీ టైమింగ్ తో, పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ను నవ్వించడానికి వచ్చేశాడు నవీన్ పొలిశెట్టి. జనవరి 14న రిలీజైన అనగనగా ఒక రాజు సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఎక్స్ (ట్విటర్)లో తమ రివ్యూలు పోస్టు చేస్తున్నారు. మెజారిటీ రివ్యూల్లో సినిమా కడుపుబ్బా నవ్వించిందనే ఉంది.

అనగనగా ఒక రాజు మూవీలో నవీన్ పొ...