భారతదేశం, జూన్ 12 -- ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విష వాయువులు లీక్‌ అయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు తెలిసింది. చంద్రశేఖర్‌, కుమార్, భైసాల్‌ ను మృతులుగా గుర్తించారు. మరికొందరు అస్వస్థతకు గురైయ్యారు.మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....