భారతదేశం, మే 23 -- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైం గుట్టును జిల్లా పోలీసులు చేధించారు. నిత్యం రూ.15-20 కోట్ల రుపాయల్ని అమెరికా పౌరుల ఖాతాల నుంచి కాజేస్తున్న ముఠా కార్యకలాపాలకు బ్రేకులు వేశారు. ఈ సైబర్‌ క్రైమ్‌ మూలాల్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో రెండ్రోజుల క్రితం అచ్యుతాపురంలో కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహించారు. ఇందులో ఓ అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించారు. పోలీసుల తనిఖీలు గమనించి కొందరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

అచ్యుతాపురం గ్రామంలోని అపార్ట్‌మెంట్‌లలో నివాసం ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల యువతీయువకులు టెలికాలర్లుగా పనిచేస్తూ అమెరికా పౌరుల్ని మోసం చేస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. వీర్వో ఫిర్యాదుత...