భారతదేశం, ఏప్రిల్ 20 -- అనంత‌పురం స‌మ‌గ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన‌్న క‌స్తూర్బా గాంధీ బాలికల విద్యాల‌య(కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ పోస్టుల‌ను అవుట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేస్తారు. అర్హత‌, ఆస‌క్తి క‌లిగిన మ‌హిళా అభ్యర్థుల నుంచి ద‌రఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నట్లు అనంత‌పురం సమగ్ర శిక్ష అడిష‌న‌ల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ టి. శైల‌జ పేర్కొన్నారు.

మొత్తం 71 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. అందులో టైప్‌-IIIలో 43 పోస్టులు, టైప్‌- IVలో 28 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

1. టైప్‌-IIIలో పోస్టులు (43) : హెడ్ కుక్‌-8, అసిస్టెంట్ కుక్‌-19, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్‌-5, స్కావెంజ‌ర్‌-5, స్వీప‌ర్‌-6 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు.

2. టైప్‌- IVలో పోస్టులు (28) : హెడ్ క...