భారతదేశం, మే 16 -- అనంతలో రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు వేస్తున్న పునాదిరాయి... భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి లాంటిదని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ.22వేలకోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు.

రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్‌ ఎనర్జీ కాంప్లెక్స్‌ సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నమన్నారు. రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ గ్రిడ్‌లకు శక్తినివ్వడమే కాకుండా... నిరుద్యోగ యువత ఆశయాలకు ఆజ్యం పోస్తుంది, రేపటి వెలుగుకు దారి చూపుతుందన్నారు.

ఏపీలో ఉత్పత్తి అయ్యే ప్రతి మెగావాట్ విద్యుత్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందని, ...