భారతదేశం, మే 7 -- కొన్నేళ్లుగా కంపెనీ ప్రణాళికలను ఆలస్యం చేస్తుండటంతో ఫోల్డబుల్ ఐఫోన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. అయితే, ఆపిల్ తాజాగా తమ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ప్రణాళికలను వేగవంతం చేసింది. పోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కాలంగా, క్రీజ్-ఫ్రీ డిస్ప్లేను తీసుకురావడంలో కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా ఫోల్డబుల్ ఐఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రణాళికలలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ కోసం క్రీజ్-ఫ్రీ డిస్ప్లే, అధునాతన హింజ్ టెక్నాలజీలను సిద్ధం చేస్తోంది.

ఫోల్డబుల్ టెక్నాలజీలో మరింత పురోగతితో ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి మరిన్ని లీకులు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు, తాజా బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే...