భారతదేశం, మే 20 -- మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్ శంకర్ గత 25 ఏళ్లుగా అనుసరించిన పెట్టుబడి వ్యూహం గురించి తెలుసుకుందాం. ఆయన గత 25 ఏళ్లలో సరళమైన పెట్టుబడుల కేటాయింపు వ్యూహాన్ని అనుసరించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఏనాడు కూడా స్థిరాదాయం అందించే వాటిపై పెట్టుబడులు పెట్టలేదు.

మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్ శంకర్ కు ఈక్విటీల మీద గట్టి నమ్మకం ఉంది. ఆయన తన ఆదాయంలో అధిక భాగం ఈక్విటీల లోనే పెట్టారు. స్థిరమైన ఆదాయం అందించే పెట్టుబడి సాధనాలపై ఆసక్తి చూపలేదు.

మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ సంస్థ రూ.1.3 ట్రిలియన్ల అడ్వయిజరీ ఆస్తులను పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థకు ఆశిష్ శంకర్ సీఈఓగా ఉన్నారు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ సిప్ చేయలేదని చెప్పారు. తన పెట్టుబడి వ్యూహాలను ఆయన ఇలా వివరించా...