భారతదేశం, డిసెంబర్ 31 -- న్యూ ఇయర్ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పక్కాగా నిఘా పెట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహిస్తుండగా.. తాజాగా క్యాబ్స్, ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రైడ్స్ నిరకారించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ ప్రకటన చేశారు.

న్యూ ఇయర్ సందర్బంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్లు రైడ్ రావడానికి నిరాకరించినా సహించేదే లేదని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించమన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

"మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే, వెంటనే మాకు తెలియజేయండి. వాహనం నంబర్, సమయం/ప్రదేశం, రైడ్ వివరాల స్క్రీన్‌షాట్ ...