భారతదేశం, ఏప్రిల్ 29 -- డబ్బు అవసరాలను తీర్చుకునేందుకు ఇప్పుడు సులభంగా అందుబాటులో ఉన్న ఆప్షన్స్​లో ఒకటి పర్సనల్​ లోన్​. బ్యాంకులు ఇప్పుడు తక్కువ సమయంలోనే పర్సనల్​ లోన్​ని మంజూరు చేస్తున్నాయి. ప్రజలు కూడా తమ అవసరాల కోసం ఈ తరహా లోన్స్​ని తీసుకుంటున్నారు. అయితే, పర్సనల్​ లోన్​ విషయంలో చాలా సందేహాలు ఉండాయి. వాటిల్లో ఒకటి 'టెన్యూర్​'! అధిక ఈఎంఐల భారం పడకూడదంటే, పర్సనల్​ లోన్​ కాలవ్యవధి ఎంత ఉండాలి? అని తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలుసుకోండి..

I. ఈఎంఐ భారతం తక్కువ చేయడానికి: మీ పర్సనల్​ లోన్ ఈఎంఐ ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు రుణ కాలపరిమితిని పెంచడాన్ని పరిగణించవచ్చు. దీంతో మీ ఈఎంఐ తగ్గుతుంది. ఉదాహరణకు మీరు రూ .5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకుంటున్నారనుకోండి (వడ్డీ రేటు 11 శాతం) - మీ నెలవారీ వాయిదా రూ .23,304...