భారతదేశం, అక్టోబర్ 29 -- మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ‌రి కోత‌ల స‌మ‌యం కావ‌డం... ప‌లు చోట్ల క‌ళ్లాల్లో ధాన్యం ఆర‌బోసిన నేప‌థ్యంలో ఎటువంటి న‌ష్టం వాటిల్ల‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం, ప‌త్తి కొనుగోలు కేంద్రాల్లోనూ త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు.

మొంథా తుపాను ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌, ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాల్లో అధికంగా ఉంది. హైద‌రాబాద్ స‌హా ఇత‌ర జిల్లాల్లోనూ భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోఅన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్ష‌న్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌, గుండ్రాతిమ‌డుగు స్టేష‌న్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లు నిలిచిపోవ‌డం.. ప‌లు రైళ్లను ద‌క్షిణ మ‌ధ్య ర...