Hyderabad, అక్టోబర్ 5 -- అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో రూపొందిన లేటెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఏమి మాయ ప్రేమలోన. అనిల్ ఇనుమడుగు హీరోగా వేణి రావ్ హీరోయిన్‌గా నటించారు. అయితే, ఇటీవల విడుదలైన 'ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బంకు మంచి ఆదరణ లభిస్తోంది.

లీడ్ రోల్స్‌లో నటించిన అనిల్ ఇనుమడుగు ఈ పాటకు లిరిక్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహించడం విశేషం. మార్క్ ప్రశాంత్ సంగీతం అందిచిన ఏమి మాయ ప్రేమలోన సాంగ్‌ను దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య ఆలపించారు.

కేరళలో బోటు నడిపే ఓ అనాథ కుర్రాడి జీవితంలో ఓ మేఘాలు కమ్ముకున్న రోజు కనిపించిన మేఘాల మధ్యన దాగిన మెరుపులా ఆ కుర్రాడికి తారాసపడిన ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకునే ఓ సున్నితమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కింది ఏమి మాయ ప్రేమలోన సాంగ్.

ఏమి మాయ ప్రేమాలోన సాంగ్ దసరా కానుకగా యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. విడుదలైన రోజు నుంచ...