భారతదేశం, జనవరి 1 -- 2025 పూర్తయి 2026లోకి అడుగుపెట్టాము. ఈరోజు ప్రదోష వ్రతం కూడా. ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష త్రయోదశి నాడు, కృష్ణపక్ష త్రయోదశి నాడు ప్రదోష వ్రతాన్ని చేస్తారు.హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. ఆ రోజు శివుడిని ఆరాధించడం వలన ఎంతో మంచి ఫలితం కనబడుతుంది. శివయ్య అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు.

ప్రదోష వ్రతాన్ని సాయంత్రం ప్రదోషకాలంలో ఆచరించాలి. జనవరి ఒకటి అంటే ఈరోజు ప్రదోష వ్రతం జరుపుకోవాలి. ఈ రోజు శివుడిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. శివుణ్ని ఆరాధిస్తే కోరికలన్నీ నెరవేరి ఆనందంగా ఉండొచ్చు. కొత్త సంవత్సరం మొదటి రోజు శివయ్యను పూజిస్తే దేనికీ లోటు ఉండదు. ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.

పంచాంగం ప్రకారం పుష్య మాసం శుక్లపక్ష త్రయోదశి తేదీ డిసెంబర్ 31, బుధవారం ఉదయం 1:48కి మొదలైంది. జనవరి ఒకటి గురువారం, అంట...