భారతదేశం, సెప్టెంబర్ 14 -- స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​కి ప్రత్యేక స్థానం ఉంది! వాటి రిటర్నులతో లైఫ్​ సెట్​ అయిపోతుందని చాలా మంది మదుపర్లు భావిస్తుంటారు. అందుకే మల్టీబ్యాగర్ల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి ఒక మల్టీబ్యాగర్​ స్టాక్​ గురించి ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాము. ఒక కంపెనీ స్టాక్​.. రూ. 1లక్షను ఏకంగా రూ. 1కోటి చేసింది! అది కూడా కేవలం 5ఏళ్లల్లోనే! ఆ కంపెనీ పేరు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్​. వివరాల్లోకి వెళితే..

పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ సంస్థ షేర్లు గత 5 సంవత్సరాలలో మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 11000% కంటే ఎక్కువ పెరిగాయి. ఐదేళ్ల క్రితం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లిమిటెడ్ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్లు ఇప్పుడు కోటీశ్వరులుగా మారారు! కంపెనీ షేర్లు ఐదేళ్లలో రూ.లక్ష పెట్టుబడిని రూ.కోటికి ...