భారతదేశం, నవంబర్ 4 -- స్పెయిన్‌లో కనిపించిన ఓ అరుదైన తెల్లటి ఇబెరియన్ లింక్స్ ఫోటో ఇంటర్నెట్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ ప్రత్యేకమైన జంతువు చిత్రాన్ని చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. చరిత్రలో ఇదే మొట్టమొదటి తెల్లటి ఇబెరియన్ లింక్స్ అని భావిస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దక్షిణ స్పెయిన్‌లో ఒక ఫోటోగ్రాఫర్ దీనిని తన కెమెరాలో బంధించారు. ఈ లేత రంగులో ఉన్న పెద్ద పిల్లి (లింక్స్)కి 'ల్యూసిజం' అనే జన్యుపరమైన సమస్య ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితి కారణంగా జంతువులలో సహజమైన వర్ణ ద్రవ్యం (Pigmentation) పాక్షికంగా కోల్పోవడం జరుగుతుంది.

@Clearsay_ అనే యూజర్ ఈ అద్భుతమైన ఫోటోను 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో పంచుకున్నారు. "చరిత్రలో తొలిసారిగా ఒక స్పానిష్ ఫోటోగ్రాఫర్ తెల్లటి ఇబెరియన్ లింక్స్‌ను గుర్తించినట్లు భావిస్తున్నారు" అని...