Hyderabad, సెప్టెంబర్ 4 -- సెప్టెంబర్ నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగనుంది. సెప్టెంబర్ బుధాదిత్య రాజయోగంతో మొదలైంది. బుధుడు, సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని గ్రహాలు కూడా రాశి మార్పు చెందుతున్నాయి. సెప్టెంబర్ 13న కుజుడు తులారాశి నుంచి కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు.

సెప్టెంబర్ 15న విలాసాలు, అదృష్టం వంటి వాటికి కారకుడైన శుక్రుడు రాశి మార్పు చెందుతాడు. అదే రోజు బుధుడు కూడా రాశి మార్పు చెందుతాడు. బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు కొన్ని రాశుల వారికి మంచి చేస్తుంది, శుభ ఫలితాలను అందిస్తుంది. మరి అదృష్ట రాశులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సంతోషంగా...