Hyderabad, సెప్టెంబర్ 10 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని, సమస్యలన్నిటికీ దూరంగా ఉండాలని అనుకుంటారు. అయితే మన జాతకంలో కొన్ని గ్రహాల స్థానం బలహీనంగా ఉన్నప్పుడు సమస్యలు రావచ్చు. అయితే సమస్యలన్నీ తొలగిపోవాలంటే గ్రహాల స్థానం బలంగా మార్చుకోవచ్చు.

మన జాతకంలో కొన్ని గ్రహాల స్థానం బలహీనంగా ఉన్నప్పుడు వాటిని రత్నాల ద్వారా మార్చే అవకాశం ఉంటుంది. మరి ఏ గ్రహానికి ఏ రత్నాన్ని ధరించాలి? ఏ రత్నం వలన గ్రహం బలంగా మారుతుంది? సమస్యలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకుందాం.

గ్రహాల రాజు సూర్యుడు ఆత్మ, శక్తి వంటి వాటిని సూచిస్తాడు. జాతకంలో సూర్యుడు స్థానం బలంగా మారాలంటే రూబీని ధరించడం మంచిది. రూబీ సూర్యుని రత్నం. బలం, ధైర్యాన్ని కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది.

రూబీని ధరిస్తే సంకల్ప శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నిర్ణయం...