Hyderabad, జూలై 7 -- ప్రతి ఒక్కరూ కూడా ఎంత కష్టపడినా, ఎంతో కొంత అదృష్టం కూడా తోడుండాలి. అప్పుడే అనుకున్న వాటిని పూర్తి చేయగలరు, సులువుగా విజయాన్ని అందుకోవచ్చు. ఇతరులకు దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. హిందూ మతంలో కొన్ని ముఖ్యమైన రోజుల్లో దానం చేయడానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు, అయితే వాటి నుంచి తక్కువ సమయంలోనే బయటపడతారు.

కానీ కొంతమందికి మాత్రం అలా కుదరదు, ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, అసలు అదృష్టం కూడా వారితో ఉండదు. అలాంటప్పుడు ఓటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అదృష్టం కలగాలన్నా, ఇబ్బందులు తొలగిపోవాలన్నా, వీటిని దానం చేయడం మంచిది. వీటిని దానం చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది, డబ్బు కొరత కూడా ఉండదు. ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు. దేవాలయంలో వీటిని దానం చేస్తే, అదృష్టం కలిగి...