Hyderabad, ఆగస్టు 7 -- నేషనల్ క్రష్ అయినా కూడా రష్మిక మందన్నాకు ట్రోలింగ్ తప్పలేదు. అయితే దానిని ఆమె ఎదుర్కొన్న తీరు గురించి మాత్రం అందరూ తెలుసుకోవాల్సిందే. తన కెరీర్‌లో చాలా నెగటివ్ పీఆర్, ట్రోల్స్‌ను ఆమె ఎదుర్కొంది. చిన్న వయసులో నిశ్చితార్థం రద్దు కావడం, అధికారికంగా అనౌన్స్ చేయని ఒక లవ్ స్టోరీ, ఆమె పాత్రల ఎంపిక.. ఇవన్నీ గాసిప్స్‌కు కారణమయ్యాయి. 'స్నాప్ విత్ స్టార్స్' అనే కార్యక్రమంలో రష్మిక ఈ నెగటివిటీ, తన దయాగుణాన్ని నటన అని ఎందుకు అంటారనే దానిపై మాట్లాడింది.

ఈ రోజుల్లో దయాగుణాన్ని నటనగా, బలహీనతగా భావిస్తున్నారని, అందుకే తాను ఎంత ఎమోషనల్, నిజాయితీగా ఉన్నానో బయట చూపించడానికి భయపడుతున్నానని రష్మిక చెప్పింది. "నేను చాలా ఎమోషనల్, నిజాయతీ గల వ్యక్తిని అని నాకు తెలుసు. కానీ నేను ఆ నిజాయతీని చూపించలేను. ఎందుకంటే దయాగుణం నటన అని, బలహీనత అని ప...