భారతదేశం, డిసెంబర్ 19 -- అఖండ 2 మూవీలో తమన్ సౌండ్ పొల్యూషన్ అంటూ చాలా రోజులుగా విమర్శలు వస్తున్న సంగతి తెలుసు కదా. కొన్ని చోట్ల స్పీకర్లు పేలిపోయాయనీ వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్ స్పందించాడు. తన తప్పు అయితే స్పీకర్లు అన్ని చోట్లా పేలాలి కదా అని అతడు ఎదురు ప్రశ్నించాడు.

అఖండ 2 మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన బీజీఎంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి తమన్ ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోల్స్ పై స్పందించాడు. ఈ ఇంటర్వ్యూ చేసిన సింగర్ సునీత ఈ అంశంపై మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఎన్ని థియేటర్లలో బ్లాస్ట్ అయ్యాయి అని అడిగింది.

దీనికి తమన్ స్పందిస్తూ.. "నేను అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాను. ఈ మధ్య చాలా థియేటర్లలో 70 ఎంఎం స్క్రీన్లు, ప్రొజెక్టర్లు మార్చారు. కానీ స్పీకర్లు మాత్రం మార్చలేదు. ...