భారతదేశం, డిసెంబర్ 15 -- దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన 'దురంధర్' సినిమా ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా నటుడు అడివి శేష్ ఈ సినిమాను 'దేశంలోనే అతిపెద్ద సినిమా'గా అభివర్ణిస్తూ, అందులోని నటీనటులను పొగుడుతూ ట్వీట్ చేశారు. రణవీర్ సింగ్, ఆర్.మాధవన్ 'సూపర్బ్ పెర్ఫార్మెన్సెస్' ఇచ్చారని చెబుతూనే, తనకు మాత్రం అక్షయ్ ఖన్నా ఫేవరెట్ అని తెలిపారు.

టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తూ సాగిపోతున్న అడివి శేష్ 'దురంధర్' ను ప్రశంసించారు. మూవీ రివ్యూను తన స్టైల్లో పోస్టు చేశారు. ఆదిత్య ధర్ అద్భుతమైన విజయాన్ని సాధించారని కొనియాడారు. "దురంధర్ ను చూసి మురిసిపోయా! దేశంలోనే అతిపెద్ద సినిమాను చూడటానికి ఆలస్యమైనా, ఇది చాలా బాగా తీశారు. ఇంతటి సంబంధిత అంశాన్ని, అనేక సూక్ష్మ నైపుణ్యాలతో చూపించడం మీ ఆదిత్య ధర్ సర్ అద్భుతమ...