Hyderabad, మే 5 -- సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారారు. సమంత రూత్ ప్రభు తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలో వస్తున్న తొలి చిత్రం 'శుభం'. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.

ఇక శుభం సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందించారు. శుబం చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆదివారం (మే 4) నాడు విశాఖపట్నంలో శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత రూత్ ప్రభు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సమంత మాట్లాడుతూ .. "వైజాగ్‌కు వస్తే ప్రతీ సారి సినిమా బ్లాక్ బస్టర్ వస్తోంది. వైజాగ్‌లో ఈవెంట్స్ అయిన మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వైజాగ్‌లో అభిమానుల్ని ...