భారతదేశం, జూలై 22 -- పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో, భారీ పీరియాడికల్ డ్రామాగా రెడీ అయిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతోంది. రెండేళ్ల బ్రేక్ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లే సినిమాను గ్రాండ్ గా రూపొందించారు. ముఖ్యంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు పవన్ డైరెక్షన్ వహించారు. ఈ సినిమా జులై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

హరి హర వీరమల్లు సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కు పవన్ కల్యాణ్ స్వయంగా డైరెక్షన్ వహించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో పవన్ వెల్లడించారు.

''రాజకీయాల్లోకి వచ్చాక రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొన్నా. కానీ సినిమాటిక్ గా ఫైట్లు చేయడానికి కష్టపడాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడో నేర్చుకున్నా మార్షల్ ఆర్ట్స్ ను మళ్లీ ...