Hyderabad, మే 5 -- మలయాళం సినిమాలకు ఇంతలా ఫాలోయింగ్ వచ్చిందంటే అదేదో గాలివాటంగా కాదు. వాళ్లు తీసే కొన్ని సినిమాలు, ఎంచుకునే కథలు, వాటిని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అలాంటిదే మిస్టరీ థ్రిల్లర్ మూవీ నిరళ్ (Nizhal) కూడా. తెలుగులో నీడ పేరుతో ఆహా వీడియోతోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది.

ఓ అంతుచిక్కని మిస్టరీని చివరి కూడా ప్రేక్షకుల అంచనాలకు అందకుండూ ఉంచుతూ థ్రిల్ పంచే సినిమాలే ఈ మిస్టరీ థ్రిల్లర్ జానర్ కిందికి వస్తాయి. అలా చూస్తే ఈ నిరళ్ (నీడ) మూవీ అసలు సిసలు మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఎప్పుడో 30 ఏళ్ల కిందట జరిగిన హత్యలను ఓ ఏడేళ్ల చిన్నారి తన కథల రూపంలో బయటపెట్టడమనే కాన్సెప్టే ఆసక్తి రేపుతుంది. దీనిని స్క్రీన్ పై అంతే ఆసక్తిగా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ నీడ మూవీ అలాంటిదే. ...