Hyderabad, సెప్టెంబర్ 28 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలతో అలరించాడు. కల్కి 2898 ఏడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ స్పిరిట్, ది రాజా సాబ్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపైన మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కాలేదు.

దాంతో ప్రస్తుతానికి అందరి ఆశలు ది రాజా సాబ్ సినిమాపైనే ఉంది. ది రాజా సాబ్ మూవీ కోసం ప్రభాస్ అభిమానులతోపాటు ఆడియెన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల విడుదల చేసిన ది రాజా సాబ్ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డార్లింగ్ ప్రభాస్‌ను మొదటిసారిగా కామెడీగా చూపిచండం కొత్తగా ఉంది.

అంతేకాకుండా ది రాజా సాబ్ టీజర్‌లో ప్రభాస్ డైలాగ్స్, లుక్స్, కామెడీ టైమింగ్ అందరికి ఎంతగానో నచ్చేసింది. దాంతో ది రాజా సాబ్ సినిమాపై అంచన...