Hyderabad, ఏప్రిల్ 24 -- మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా అంటే అందులోని ట్విస్టులు, థ్రిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఇండస్ట్రీ మేకర్స్ ఇవి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు చెప్పబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీది మరో లెవెల్. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో కూడా సినిమా తీస్తారా అనిపించేలా ఇది సాగుతుంది. ఆ మూవీ పేరు కురుప్ (Kurup).

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, శోభిత ధూళిపాళ్ల నటించిన మూవీ కురుప్. 2021లో థియేటర్లలో రిలీజైంది. ఐఎండీబీలో 7 రేటింగ్ సాధించింది. రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. రూ.78 కోట్లు వసూలు చేసింది. శ్రీనాథ్ రాజేంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓ రియల్ స్టోరీ. కేరళ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సుకుమార కురుప్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఓ బయోగ్రఫికల్ పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎలా ...