భారతదేశం, డిసెంబర్ 7 -- ఓటీటీ కంటెంట్‌లో, స్టోరీ, నెరేషన్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ కేవలం ఓటీటీ సిరీస్ మాత్రమే కాదు ఆ ఫ్యాన్స్‌కు ఓ ఎమోషన్ కూడా. అలాంటి గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమానలకు మేకర్స్ అయన హెచ్‌బీఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, ఇప్పటికీ సోషల్ మీడియాలో సీన్స్ వైరల్ అవుతున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి మరో ప్రీక్వెల్ సిరీస్ రానుంది. ఇదివరకే ప్రీక్వెల్‌గా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఓటీటీ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరోటి స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.

ఆ సిరీసే ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ (A Knight of the Seven Kingdoms). ఇటీవలే ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సి...