భారతదేశం, జూలై 11 -- ఎలాన్ మస్క్ గ్రోక్ 4, గ్రోక్ 4 హెవీలను ప్రపంచానికి పరిచయం చేశారు. మునుపటి వెర్షన్లలోని యాంటిసెమిటిక్ వ్యాఖ్యలను సరిదిద్దే లక్ష్యంతో, ఈ కొత్త మోడల్ 'బిగ్ బ్యాంగ్ ఇంటెలిజెన్స్' శకాన్ని తెరవడానికి రూపొందించామని మస్క్ చెప్పారు. ''ఇంటర్నెట్లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడా సమాధానాలు దొరకని క్లిష్టమైన, వాస్తవ ప్రపంచ ఇంజినీరింగ్ ప్రశ్నలను ఏఐ పరిష్కరించగలగడం నా అనుభవంలో ఇదే తొలిసారి. ఇది మరింత మెరుగవుతుంది'' అని లాంచ్ అయిన వెంటనే మస్క్ సోషల్ మీడియాలో రాశారు. అప్పటి నుంచి తన పోస్ట్ పై వస్తున్న కామెంట్లు, ప్రశ్నలకు రీపోస్టింగ్, రిప్లై ఇవ్వడంలో నిమగ్నమయ్యారు.

కొత్తగా లాంచ్ చేసిన ఈ ఎక్స్ ఏఐ మోడళ్లైన గ్రోక్ 4 మరియు గ్రోక్ 4 హెవీ ఓపెన్ఏఐ జీపీటీ-5, గూగుల్ కు చెందిన జెమినీల వేగం, కచ్చితత్వం, విజన్ కు సవాలు విసురుతున్నాయి. ప్లాట్ఫామ్ ...