Hyderabad, జూలై 3 -- పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ ప్రెస్టిజీయెస్ చిత్రం హరి హర వీరమల్లు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.

హిస్టారికల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన హరి హర వీరమల్లు సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్‌గా పవన్ కల్యాణ్ సరసన జోడీ కట్టింది.

తాజాగా మేకర్స్ చెప్పినట్లుగా ఇవాళ (జూలై 3) హరి హర వీరమల్లు ట్రైలర్‌ రిలీజ్ అయింది. రెండు నిమిషాల 56 సెకన్లపాటు ఉన్న హరి హర వీరమల్లు ట్రైలర్ ఆద్యంతం అదిరిపోయింది. ప్రారంభం నుంచి చివరి వరకు మంచి హై ఇచ్చేలా ఈ ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.

ముఖ్యంగా ఇందులో పవన్ కల్యాణ్ కనిపించిన తీరు హైలెట్‌...