Hyderabad, జూలై 4 -- స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఒకటి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య. అయితే ఆ హత్య కేసులో అసలు నిందితులను కేవలం 90 రోజుల్లోనే పట్టుకోవడం అనేది మరో రికార్డు. అలా రాజీవ్ హంతకుల వేట ఎలా సాగిందో కళ్లకు కట్టడానికి ఇప్పుడు ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ ( The Hunt: The Rajiv Gandhi Assassination Case) వెబ్ సిరీస్ వచ్చింది. సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

వెబ్ సిరీస్: ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్

డైరెక్టర్: నగేష్ కుకునూర్

నటీనటులు: అమిత్ సియాల్, భాగవతి పెరుమాల్, గిరీష్ శర్మ, ఆపేక్ష అయ్యర్, గౌరీ మేనన్ తదితరులు

ఓటీటీ: సోనీ లివ్

మే 21, 1991.. ఈ దేశం మెచ్చిన ప్రధానమంత్రుల్లో ఒకరైన రాజీవ్ గాంధీని కోల్పోయిన రోజు అది. తమిళనాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓ ఎల్టీటీఈ ఉగ్రవాది మానవ బాంబుగా ...