Hyderabad, ఆగస్టు 21 -- మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు విశ్వంభర టీమ్ మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది. శుక్రవారం (ఆగస్టు 22) చిరు తన 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వేళ ఒక రోజు ముందే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీలో చిరంజీవి నట విశ్వరూపం చూపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న మూవీ విశ్వంభర. ఆ సినిమాతో తన కెరీర్లో మెగా హిట్ సొంతం చేసుకున్న అతడు.. రెండో సినిమాలోనే మెగాస్టార్ చిరంజీవితో పని చేసే అవకాశం దక్కించుకున్నాడు. విశ్వంభర అంటూ ఈసారి మైథలాజికల్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా గురువారం (ఆగస్టు 21) సాయంత్రం 6:06 గంటలకు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఒక నిమిషం 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేపుతోంది. కొన ఊపిరితో ఉన్...