Hyderabad, జూలై 27 -- తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో 'కింగ్‌డమ్' ఒకటి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కింగ్‌డమ్ మూవీలో మరో హీరో సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషఇంచాడు. అలాగే, ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది.

మళ్లీ రావా, జెర్సీ వంటి చిత్రాలను తెరకెక్కంచిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కింగ్‌డమ్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

జూలై 31న కింగ్‌డమ్ మూవీ థియేటర్లలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో కింగ్‌డమ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా శనివారం (జూలై 26) రాత్రి 11 గంటల సమయంలో...