భారతదేశం, నవంబర్ 2 -- రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ సినిమాలో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా రిలీజైన ఆడియో సాంగ్ అదరగొడుతోంది. అక్టోబర్ 31న యూట్యూబ్ లో రిలీజైన ఈ లిరికల్ సాంగ్ ఇప్పటికే రెండు రోజుల్లోనే 1.8 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టింది.

ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి రిలీజైన 'చిన్ని గుండెలో' సాంగ్ లో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని కొంతకాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్ని గుండెలో సాంగ్ లో ఇద్దరూ ఎంతో ముద్దుగా కనిపించారు. ఈ సినిమాకు పి.మహేష్ బాబు డైరెక్టర్.

లవ్ మెలోడీ చిన్ని గుండెలో సాంగ్ లిరిక్స్ హత్తుకునేలా ఉన్నాయి. ఈ పాటకు కృష్ణ కాంత్‌ అద్భుతమైన సాహిత్యం అందించారు. మెర్విన్, సత్య ...