భారతదేశం, మే 5 -- అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్‌తో సహా చాలా అదానీ గ్రూప్ స్టాక్స్ ఈరోజు స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగాయి. అమెరికాలో నమోదైన అవినీతి కేసులో గౌతమ్ అదానీపై ఉన్న అభియోగాలను ఎత్తివేస్తారనే వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్‌లోని ప్రధాన షేర్లు ఈరోజు పెరిగాయి.

అమెరికాలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ఉన్న 265 మిలియన్ డాలర్ల విదేశీ లంచం కేసును క్లోజ్ చేయడానికి ఆయన టీమ్ డోనాల్డ్ ట్రంప్ అధికారులతో చర్చలు ప్రారంభించిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ద్వారా వెల్లడైంది. నివేదిక ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ చర్చలు కొనసాగుతున్నాయి. చర్చలు వేగంగా జరుగుతున్నాయి. ఒక నెలరోజుల్లోపు ముగిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇండియాలో విద్యుత్ సరఫరా ప్రాజెక్టులు దక్కించుకునేందుకు ప్రభుత్వ అధికారులకు భారీగా లాంఛాలు ఇచ్చినట్టుగా అదాన...